Saturday, December 12, 2020

Sun Rise

 మ||

చనుదెంచెన్ రవి మంత్రముగ్ధగతసంజాతుండు ఖండాంతరా

ర్చనలన్ గొంచు ననేకదేశములనాచారంబులన్, చిత్తముల్

ధ్వనియించన్ ప్రణవంబునందు కనులన్ దర్శించు మాత్రంబునన్,

ఘనవర్ణార్ణవసిక్తమైగను నభోఘంటాపథజ్వాలయై


ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻

Friday, December 4, 2020

On a railway track passing through a canopy of greenery

 చం||

చుకుచుకుమంచు రైళ్ళు వని జొచ్చుకువోవుచునుండ చుట్టు ప్రా

కు కుజలతల్ గ్రహించి ఘనగుంభనవైఖరి జూపవైచి భం

జకములు గాక బ్రాకె దివిజాధిపుఛాపము రూపు దాల్చుచున్  

ప్రకృతిని శక్తి గూర్చనిల వైభవమున్ దెలుపంగశక్యమే?


కం||

రైలు బయల్పడు దారిని

దూలక శాకములనొప్పె తూగుచునుండన్

డోలిక వలె రూపుగనుచు

వ్రాలెడి పత్రములవర్షపాతమునిడుచున్


ఆ.వె||

అందమైన వనమునందునురుకు రైలు

అచట లతలు ప్రాకెనాకశముకు

కప్పు వలెనమరుచు కలిగించెనాహ్లాద

భరితమైన సొగసు బాటయందు


తే.గీ||

రైలుపట్టాలు పుట్టలన్ రమ్యరసభ

రితముగా దోచు లతలయన్ లీనమయ్యె

వనమునన్ యానమునుజేయ వాంఛగలిగె

అమరపురికేగు దారిదేయనుచు దోచె


ఆదిపూడి రోహిత్

Monday, November 9, 2020

On Elections

 అంశము: ఎన్నికలు


ఉ||

దీనదరిద్రదైన్యదురదృష్టములై గను శృంఖలంబులన్

సూనపరాయణంబునిడ జూచెడు రాచరికంబు ద్రుంచగన్

సేనల దుష్టసంగతుల చీకటికోటల మట్టుబెట్టగన్

మానవజాతికిన్ వెతలు మాన్పగ సాధ్యముజేయునెన్నికల్


ఉ||

మాకు మహాత్ముడైన జనమాన్యుడొకండను గద్దెనెక్కగా

నేకపథంబునన్ మనమనేకవిధంబుల పేరుగాంచు ర

త్నాకరతుల్యనాయకుల ధైర్యముగల్గినవారి మాకునై

వాకొను స్థానమిచ్చెదము, వారికి వోటుల రాజముద్రికన్


ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Thursday, October 29, 2020

నీవూ నేను మనము మనదేశము

 గోవిందరాజు సీతాదేవి ఐక్య వేదిక 

జాతీయ సమైక్యతా దినోత్సవం కోసం పోటీ కి 


అంశం... జాతి  ఐక్యత.. దేశ భద్రత 


 *శీర్షిక* : నీవూ నేను మనము మనదేశము


నీ మాటను నేను నిలబెడతాను

నా మాటను నీవు నిలబెడతావు

మాటా మాటా వస్తుంది

తూటా ఐ అది దూస్తుంది 

ఐనా నీవు నేను నిలబడ్డాం

ఒకరిని ఒకరం నిలబెట్టాం

చేయి చేయి కలిపాం

దేశస్వాతంత్రార్ణవసమిధను వెలిగించాం

దేశంలో మనమంతా ఒకరిమనే చెప్పాం


మాలో మాలో మాకెన్నున్నా

భారతమాతకి బిడ్డలమైనాం

మేమే మా స్పేస్షిప్లూ హెలికాప్టర్లూ

గాంధీ ఖాదీ నేసిన మాదిరి

దేశంలోనే నిర్మిస్తాం

స్నేహితులైన విదేశాలను ప్రేమిస్తాం

వేరే దేశపు భూములు చీపురు పుల్లలు మాకు

మా దేశాన్నెవడైనా ఆక్రమించాలని చూస్తే

ఆ చూపును చదరగొడతాం

మా విజ్ఞానంతో మా శాస్త్రంతో మా వీరంతో

మా ధీరంతో మా ధైర్యంతో మా ధర్మంతో.


ఆదిపూడి వెంకట రోహిత్

Detroit USA

Ph. +1 8188357381

Wednesday, October 21, 2020

Cell phone

 శా||

మీరే జెప్పుడు యిప్పుడెందరిడెనా మేలైన యంత్రంబు యీ

తీరే నేటి శతాబ్దమందు మొదలై దిక్సూచిగా నిల్వ నీ

తోరమ్మంచును జీవితంబునిడి సంతోషంబు గంగొంటివే

నీరే లేని యెడారిలోన గనుచున్ నెట్వర్కు సెల్ఫోనుయన్


ఆదిపూడి వెంకట రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

Monday, October 12, 2020

Lakshmi stuti

 అమ్మా లక్ష్మీ దేవీ...!!


శ్రీ! భూమిన్ బడి బొచ్చె చేతనిడి తల్లీ! ధర్మమంచున్ సదా

లాభంబెద్దియులేని చిల్లరను చాలన్ జాలకన్ జీవనం

బాభీలంబుగ సాగదీయుమనుషుల్ భస్మంబవన్ వీరికై

సౌభాగ్యంబును గోర కైతలిడునే సాపాడు డొక్కాడగన్?


రోహిత్🙏🏻🙏🏻🙏🏻

Friday, October 2, 2020

​Paving the way for the Unborn Citizen

 ​Paving the way for the Unborn Citizen

Abstract: ​Many Countries in the 21st century are striving to up their indices including the GDP, HDI. Every government wants to ensure that the people of their nation make a decent wage, do not rely on their social security schemes, and make themselves self-sustainable. The nations of the world also want to make their credit profile better in the eyes of the International Monetary Fund and acquire financial benefits to fund their massive prospecive schemes. Every government wants to make their presence felt on the world stage.This paper highlights what India must do in order to better educate their citizens and pave the way for the future citizens in the light of current events.

Introduction:

Paving the way for the future unborn citizen is to not just make their life easy but to carve a path for their contribution to betterment of society. With the evils of religious and caste based bigotry there are already children living today that are facing a multitude of issues to shine and show their prowess. Legally none of these issues may exist but they exist subtly in the minds of people. We have seen news items that even in silicon Valley the caste system based discrimination prevails today. There are many people who are born in what we call "Forward castes" to families that are impoverished. These children lose the battle against reservation based on caste on the contrary of what we saw in the news about Silicon Valley. We need to address these issues to make sure none of the children born after today, face these issues and they must be helped to grow in a benign society that rewards every citizen by helping them shine in their own way in their own light. 

Methods:

Education is not merely degree certificates and this phrase has almost become a cliche to everyone. However, we all have some kind of degree on this esteemed forum. Without that there is no possibility to understand our world. We have to understand our world in order to help it in the first place nevertheless. 

Today's competitive world forces children to excel in math and science for instance and the best scores on competitive examinations make the cut to IITs and IIMs. There are 10,000 IIT candidates selected every year out of nearly more than half a million people. Everyone else who didn't make the cut trickle down into the rest of the Universities and colleges based on their merit. The questions we need to ask is, do we need so many Computer science and Electronics graduates, how many Agricultural specialists, Biotechnologists, doctors, mechanical engineers, Educators, Teachers, Evangelists, Inspirers, and how many more people do we need in order to put the sticks together to reach the banana after the above folks chalk out plans on how to do it.

We need people in every field but we only selectively choose folks with the highest scores. In my opinion, this is a grand way to lose Teslas, Einsteins, Curies and other great geniuses who have amazing minds but they do not have the skill to get that score by remembeding a few things for an exam. 

In the light of Modern communication infrastructure, internet and platforms like this being made available, we have to create forums to dig and find these geniuses as a start. We have to reach out to every school in every district in every State in the country and not just find the bright ones but to sculpt bright minds and help them express their creativity. We have to make the back benches shine. 

We also have to respect all kinds of professions and treat everyone with the same dignity. Some children may develop the affinity to do things and some mau develop affinity to chalk out plans on how to do things. In today's world, we respect the Chalkers and Talkers and not so much in regards to the Doers. This has to change.

The way we can change this is to ensure that the doers get as much remuneration as the chalkers. When their do their best in doing, we have to reward them. Someone might dream a bridge across the shores of Kerala to Lakshadweep but someone still has to pull the levers of the Excavators, earth movers and someone might still be lifting bricks on their heads. We should make sure they get their fair share of remuneration and respect. This way we can expand the consciousness of today's society so parents don't just push their children into Computer science where many end up with a Certification but not a real qualification.

All children must have access to high speed internet, forums where they can showcase their skills. Then, Universitites recognizing these skills and not just scores becomes a challange. We need a massive influx of educators to evaluate and analyze these future citizens based on their skills they showcased along with their scores. We need hundreds and thousands of IITs and not just a few tens given our population size. We need to ensure these aspects are addressed in tandem to make India shine.

Results:

The results we expect from implementing the above are that all children have access to quality education via the internet, with access to forums and platforms to showcase their talents, universities encouraging the prospective student's talent from a spectrum of their achievements and not just test scores, society respecting every profession through remuneration and respect. This will ensure that out of the more than a billion people we have and we will continue to have in the foreseeable future, we will have a colorful combination of professions into which children grow into out of passion and love and not just force from the family or society. When something is done from love and passion, destiny smiles on us.

Conclusion:

Our goal to make India shine in regards to education starts with looking at children as not statistics and test scores but as potential to build something that is needed to make the country shine. 


Saturday, September 19, 2020

raadhaa kRshnula samasya

 కృష్ణుడూ రాధా కలిసి వనములో వారు ఉండగా ప్రణయములో రాధ కృష్ణుని ముఖమును దగ్గరగా జూస్తూ ఆయన ముఖసౌష్ఠవానికి ముగ్ధురాలై ఆయన ముక్కును ముద్దు పెట్టుకున్నది.

ఉ||

శీతలసంధ్యయన్ వనము జేరగ రాధ సఖాసమేతయై

పాతములై గనన్ ప్రణయవర్షసుధారసధారలిద్దరున్

జూతురు మోము మోము గని! సుందరసౌష్ఠవకృష్ణు మోమునన్

ఘ్రాతిని గాంచి ముద్దులిడె రాధమనంబున మోదమొందుచున్!

ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

Wednesday, September 16, 2020

Crippled but determined



చం||

నడువడి లేని జీవితము నాదని మూలన గూర్చొనన్ విడన్

దొడదొడ గంతులేయగల దూకుడు లేదననేడుపున్ విడన్

పుడమిని మించునోర్పుగని పూనికతోడ సుయోగమార్గమున్

కడు దృఢనిశ్చయంబు గని కాంత దలంపనసాధ్యమేమిలన్?


ఆదిపూడి రోహిత్ శర్మ

Monday, September 14, 2020

Coronavirus issues

1. Indiscriminate and unethical meat consumption

ఉ||

ఏ గహనంబునందొ సెలయేరులనో గుహలందునో గనన్

డేగల గ్రద్దలన్ మరొకటేమని జెప్పగలేని జీవులన్

తీగల గట్టి దెచ్చి ఘనదీనపరిస్థితులందు బెట్టుచున్

వీగెను మానవాధములు, వేడ్క శృతిన్ గని రాగమొందెడిన్


2. When such massive endeavors are being made to contain the virus, what's your problem just staying home?

శా||

విజ్ఞానంబను పగ్గముల్ నవయుగాన్వేషధ్వజంబున్ బృహ

ద్ప్రజ్ఞాశాలులు క్షత్రియుల్, సుగుణసంపన్నాత్ములున్ సారథుల్,

యజ్ఞంబున్ వలె యుద్ధమున్ వదులజేయంగన్ కరోనాను లో

కజ్ఞత్వంబునునెల్లరున్ గనుచు దిగ్బంధంబునందుండరే?


3. The conditions of migrant workers, ah! Amazing isn't it?

(వ్యంగ్యము)

ఉ||

కార్మికులెల్లరున్ విషమగాథల బోలు పథంబునేగగన్

ఘర్మజలంబులేరులుగ గార్చిరి వారు కరోన వల్ల యే

ధర్మవిభుండు వారి ఘనదైన్యపరిస్థితినుండి దీసె? ఛీ!

దుర్మతి రాజుగాగ బరితోషము గైకొనిరెల్లవారలున్!


4. People will have to eat dirt if the economy can't bounce back.

ఉ||

పొట్టను జేతబట్టుకుని బుట్టెడు వస్తువులమ్మగోరుచున్

తట్టల క్రొద్ది బాధలను దాల్చగ నెత్తిన వాడవాడలన్

కట్టడి జేయ వర్తనమగాధమునందు కరోన బెట్టగన్

మట్టిని మ్రింగునే సగటుమానవుడీవిధియే బలీయమౌ!


ఆదిపూడి వెంకట రోహిత్

Sunday, September 13, 2020

Another poorana 13th sep 2020

 ఆధ్యాత్మిక పూరణ:


మ||

సులువే నీ పదపంకజద్వయము సంక్షోభాత్ములౌచున్ గనన్?

పలు విద్యాదితపోబలప్రకటితప్రాబల్యశక్త్యాదులన్

ఫలిలంబౌ రసరమ్యమౌ ద్రవముతో వ్రాయంగ చిద్ఘంట లే

ఖలు నిం గొల్చినవాడె యర్హుడగు మోక్షంబందగా నిచ్చెలున్


విరుపు: లేఖలు


ఆదిపూడి రోహిత్

Thursday, September 10, 2020

A poem on Drona and Arjuna

 ద్రోణార్జునుల అనుబంధము అపూర్వము. నిరుపమానము. 🙏🏻🙏🏻


మ||

గురుశిష్యుల్ శరఛాపముల్ గనిన భూగోళంబునన్ పార్థునిన్

మరియున్ ద్రోణుని దల్తురెల్లరును సామాన్యంబుగా. జిష్ణునిన్

గురి పక్షిన్ విడనక్షుమధ్యములగున్ లోకోత్తరశ్రేష్ఠతన్

గురువున్ మించిన శిష్యుడీతడయెనీక్షోణిన్ సమారూఢిగన్


ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

Monday, September 7, 2020

Another Samasya

"విరాటుడి దగ్గర తలదాచుకున్న పాండవులు ఆయన గోధనాన్ని రక్షించే సన్నివేశం.."


మ||

కురుసైన్యంబు విరాటరాజ్యమును కంక్షోభంబునన్ బెట్ట గో

సిరులన్ బంధనజేయ పాండవులు నిక్షేపంబు రక్షింపనీ

తెరనెత్తంగ ముహూర్తమిద్దెయననుత్తేజంబుతో పోరునీ

పరతంత్రుల్ చరియింత్రు దీనజనకల్పక్ష్మాజ సాదృశ్యులై


2వ పూరణ:

మ||

వరముల్ జిమ్ముచునైదువత్సరములవ్వన్ వీధులన్ నాయకుల్

పరమప్రేమల జూపి 'ఫ్రీ' ధనము సంపాదించకే యిచ్చెడిన్

తరుణోపాయముగా ప్రజావనరులన్ దాక్షిణ్యభావంబుతోన్

పరతంత్రుల్ చరియింత్రు దీనజనకల్పక్ష్మాజ సాదృశ్యులై


ఆదిపూడి రోహిత్

Friday, September 4, 2020

Dheeroddhata lakshanamu

2వ సారి రాముని అండతో వాలి ని యుద్ధాని రమ్మంటూ సుగ్రీవుని ప్రలాపము:


శా||

కోపంబున్ నను రాజ్యవీధులనిడన్ క్షోబించెడిన్ నా సతిన్

కాపాడంగ పలాయనంబిడితినింకన్ జాలు వాలీ! నినున్

రాపాడన్ గడు ముచ్చటైనదిట రా! రా! రా ప్రహారంబుకున్!

నాపై యుద్ధమటన్న మేలయిన విన్యాసంబగున్ సోదరా!


ఆదిపూడి రోహిత్ 

Wednesday, September 2, 2020

samasya - samsleSaakshara praasa

 అందరూ చేపలబుట్టలో చేపలే చూస్తారు.. విప్రులు ఆ మీనాక్షీ అమ్మవారిని చూస్తారు..

కవిలులు మాత్రము వ్యాసభగవానుని తలుచుకుని వ్రాస్తారు గావున...అసాధారణ భావాలకోసం చూస్తూ వ్రాద్దామనుకుంటారు, అసాధారణమైనటువన్నీ చూస్తారు.. అవి చాలవు కొన్ని సందర్భాలలో..


అందరికీ తన్మాత్రలున్నట్టే కవికి ఒక extra వికటతన్మాత్ర ఉంటుంది.. అదిపోయినప్పుడు ఈ రొండిటినీ కలుపడమే దానికి మందు గా భావించి కలుపుతుంటారు😀😀


శా||

మత్స్యాధానమునందు జూడ గను సామాన్యంబుగన్ చేపలన్

మత్స్యాక్షిన్ గను విప్రవర్యులు దగన్ మత్స్యోదరీయస్పృహన్

మత్స్యోచ్ఛిష్టము జాలునే వికటతన్మాత్రావియోగంబునన్

మత్స్యక్షీరము బిల్లికొమ్ము గలుపన్ మందౌ కవీంద్రాళికిన్


ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻

Wednesday, August 26, 2020

యమకాలంకారము తో పద్యము

యమకాలంకారము తో పద్యము:


నాలుగుపాదాలలోనూ మొదటి మూడు అక్షరాలు ఆకలి (అర్థ భేదముతో)


ఉ||

ఆకలి యంచు చెప్పదగునా దొర, యాపసి బిడ్డజెప్పునే?

ఆ కలి వర్తనంబెయిది యాపసికందునపాయమున్ విడన్!

ఆ కలికైన శ్రీసతియునా పరమాత్ముని గోరినంతనా

నాకఁ లివన్ విడన్ తరలియా యిరుదొమ్మరివారి గావడే?


4 line - without taking that condition lightly act fast to save them. ఆక - that condition, లివన్ - lightness


ఆదిపూడి రోహిత్ శర్మ🙏🏻🙏🏻


Tuesday, August 25, 2020

Alamkaaras and chandassu - with poetry on weaverbirds

The two poems below portray the stunning prowess of a weaver bird in building a nest and offer praise. I attempted to prove that no matter what meter you choose you can convey the same idea. But the simpler the meter, the more complex it becomes to decorate it with alamkaaraas and to handle the loss of information. The more complex the meter, the more a moderately skilled poet is prone to committing doshas. The more complex the meter, the more utilitarianism is needed in the wordings, structuring and decorating the poem. This is the dance of skilled poetry. Whatever you choose as a meter, the goal is to make the structure as impeccable as the weaver bird's nest and to not use filler words. To waste a letter in the meter is to chisle off an intricately carved mudra of a sculpture of a celestial dancer and make her seem like she wears a glove.

An utpalamala like the lne below is easy to write. But to decorate it with alamkaras is a tough job. The two poems below have alamkaras. But the utpalamala has them refined better. 

A simpler ataveladi.

ఆ.వె||

గాలివచ్చెనేని గదులునే? నీగూడు

కొయ్యగూడుగాదు కోటయె! నిను

పోలు సృష్టిలేదు పూజ్యుండవనె ఝాష్వ!

తరువు తరువె నీది? విరుల గుడియె


A moderately complex utpalamala with more than 5 alamkaras. (To be discussed later).

 ఉ||

గాలికి క్రుంగునేని గిజిగాడ విశేషము నీదు గూడిటుల్

వ్రాలిన వృక్షశాఖముల ప్రజ్వలమైన భవంతి గాదె యే

పోలిక లేదు నీకునెట పూజ్యుడవైతివి ఝాషువాకు నీ

సాలము సాలమే? బహువిశాల సుమాల సరాల కోవెలౌ!

Monday, August 24, 2020

Poem I wrote : కృష్ణుని సఖియైన ఒక గోపబాలిక తన కుటుంబీకునకు చేసిన వ్యాఖ్య:

కృష్ణుని సఖియైన ఒక గోపబాలిక తన కుటుంబీకునకు చేసిన వ్యాఖ్య:


మ||

అనుమానింపకు వానికున్న బలమందాలోచనల్ కూడవా

వనజాక్షుండు సహస్రసీర్షపురుషవ్యాపారలీలార్ణవ

ధ్వనితంబౌ ప్రణవంబు వేణుగతనాదంబున్ ధ్వనించేటి  త

త్వనితాంతాభ్యసనంబుజేయు విభుడౌ, ధైర్యంబుగన్ నిల్చెడిన్!

Thursday, August 13, 2020

కరిగే మంచులా Telugu song

 A love song I wrote for fun. 


కరిగే మంచులా తొలగిందే నీతో దూరం!

మనసే వెన్నెలై కురిసిందే వెల్లువై!

నిను చూసిన నాలో లోకం లోతుల్లో కలిగెను చిరు వలపె!

పులకింతలు ఆశల రెక్కలతో పరవశమై ఎగిసెనే!

కలలా నిజమై నీ రూపే ,

నాలో సగమై నిలిచెనే!


(కరిగే మంచులా)


కోకిలల కిలకిలలో వినిపించే సవ్వడికాదా

నీ హృదయం నా హృదయాన్నే కోరగా !

కలువల్లో విలవిలలో కనిపించే ఊగిసలాట

అవునంటూ చేసిన అంగీకారమా?

పెదవే మెదిలే హృదయముతో జతులల్లో!

తనువే తొణికే కునులల్లో కదలికతో!

ఈ తీరని ఆశలు తీయ్యగ తాకెను తొందరపడి తీరముతో!


(కరిగే మంచులా)


వెన్నెల్లో మల్లెల్లా కలిసిపోయే వేళా

నక్షత్రం లా దురం కావుగా!

మబ్బుల్లో చంద్రుళ్ళా రహస్యం నీ రూటంతా

నక్షత్రం ఉన్నది నీతో నే కదా!

నిశిలో వెలిగే మెరుపల్లే నీ సొగసు!

కసిగా తదిమే చలిమంతే నీ వయసు!

ఈ తరునం ముగిసే వెగము సంధ్య సమయం తరిమె క్షణము!

Monday, August 10, 2020

Krishna lifting Govardhana mountain

My poem about a gopika talking to a family member about Krishna when they are hesitant to stand underneath.


కృష్ణుని సఖియైన ఒక గోపబాలిక తన కుటుంబీకునకు చేసిన వ్యాఖ్య:


మ||

అనుమానింపకు వానికున్న బలమందాలోచనల్ కూడవా

వనజాక్షుండు సహస్రసీర్షపురుషవ్యాపారలీలార్ణవ

ధ్వనితంబౌ ప్రణవంబు వేణుగతనాదంబున్ ధ్వనించేటి  త

త్వనితాంతాభ్యసనంబుజేయు విభుడౌ, ధైర్యంబుగన్ నిల్చెడిన్!


ఈ పద్యం నాకు కృష్ణుడిచ్చినట్టే భావిస్తాను.

ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻